dangerous I land : మీరు ఈ ద్వీపం లో అడుగు పెట్టారో… అవి మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తాయి…!

dangerous I land : ప్రపంచం మొత్తం చుట్టేయాలని అనుకునే వాళ్ళు చాల మంది ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రదేశాలకు మాత్రం వెళ్ళలేరు. ఆ కొన్ని ప్రదేశాలు వెళ్ళడానికి అక్కడి ప్రభుత్వాలు అనుమతించవు. ఎందుకంటే ఆ ప్రదేశానికి పొరపాటున వెళ్తే తిరిగి రారు కాబట్టి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి చాల మంది మరణించడం, కొన్ని సార్లు వారి జాడ కూడా దొరకక పోవడంతో , ఆ ప్రదేశాలను అతి ప్రమాదకరమైన వాటిగా గుర్తిచి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.
ఇప్పుడు ఆలాంటి ఒక భయంకరమైన ప్రదేశం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం…

భూ భాగంపై ఉన్న అతి భయంకరమైన ప్రదేశాలలో ఇదొకటని చెప్పవచ్చు. ఇలాంటి ప్రదేశాలకు గుండెజబ్బు ఉన్నవారిని తీసుకెళ్తే , క్షణాల్లో గుండె ఆగిపోవడం ఖాయం. ఈ స్థలం భూమి మీద ఉన్న భయంకరమైన స్థలంగా నిషేధ అజ్ఞాలున్న మొట్టమొదటి స్థలం గా నిలిచింది.
మరి ఇది ఎక్కడుందంటే.. ద్వీపం పేరు “సావో పౌల్.. ఇల్హా డా క్యూమాడా గ్రాండే” అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ తీరంలో ఉంది. దీనినే “స్నేక్ ఐలాండ్” గా కూడా పిలుస్తారు. దాదాపు 110 ఎకరాల్లో 430,000 పాములు ఉన్న ప్రదేశంగా సైంటిస్టులు గుర్తించారు. ఈ ద్వీపం లో ఉన్న పాములు బయటి పాముల కంటే చాలా బలమైనవి, చాలా విషపూరితమైనవి, వీటికి గాని దొరికామా..పీల్చి పిప్పి చేస్తాయి. ఈ ప్రదేశంలో వేరే జీవి బతుకడం కష్టమని కూడా తేల్చేశారు.

ఈ ప్రదేశంలో నిషేధ ఆజ్ఞలు లేనపుడు కొంత మంది అక్కడి వెళ్లి చనిపోవడంతో అక్కడి ప్రభుత్వాలు మనుషులు అక్కడికి వెళ్లడాన్ని నిషేధించాయి. ఈ ‘స్నేక్ ఐలాండ్’ లో అతి ప్రమాదకరమైన పాము పేరు ‘ లాన్స్హెడ్’ , ఇవి గనక కాటు వేస్తె… ఒక గంట లోపు చనిపోతాయి. ఇవి ద్వీపంలో 2,000 మరియు 4,000 పాములు ఉన్నాయని అంచనా, వీటి పొడవు ఒకటిన్నర అడుగు వరకు ఉంటాయి. ఇవి చాల విషపూరితమైనవి. వీటి విషం గుండె జబ్బులకు ఉపయోగపడుతుందట. అందుకనే ఈ విషానికి బ్లాక్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉండటంతో కొంతమంది ప్రజలు ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అందుకనే ఆ ద్వీపానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసారు.