Viral news in telugu

ఇదెక్కడి రూల్ నాయన ? 5 నిముషాల ముందే ఆఫీస్ నుండి వెళ్ళిపోతే… అది కట్ చేస్తారట… ఎక్కడో తెలుసా…!

If you leave the office 5 minutes early it will be cut

మామూలుగా ఏ ఆఫీస్ లోనైనా ప్రతీ ఉద్యోగి 8 నుండి 9 గంటలు కష్టపడుతూ  ఉంటారు.  ప్రభుత్వ ఆఫీసుల్లో అయితే చెప్పనవసరంలేదు రికార్డుల్లో సంతకాలు  ఉంటాయి కానీ మనుషులు కనపడరు. ఒక వేళా ఉంటె ఏ టైం కు వస్తారో , ఏ టైం కు వెళ్తారో ఎవరికీ తెలీదు.  కానీ జపాన్ లో  మాత్రం ఈ పప్పులేమి ఉడకవట ,  ఆఫీసు వెళ్లి , తిరిగి ఆఫీసు వేళలు ముగిసే సమయానికంటే 2 నిముషాలు ముందుగా వెళ్ళిపోయిన  ఆ ఉద్యోగుల వేతనం కొంత కట్ చేస్తారట.  ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇలాంటి రూల్ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇలా జపాన్ లో కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. ఈ నిబంధన ప్రభుత్వ ఆఫీస్ లలో పనిచేసేవారికి ఒక మొట్టికాయనే చెప్పవచ్చు.  ఇప్పటికే ఈ విధమైన ‘చండశాసన’ నిబంధనను అమల్లోకి తెచ్చారు. రెండు నిముషాలు ముందు గానే వెళ్తారా,  వెళ్తే వెళ్ళండి, శాలరీ కట్ మాత్రం తప్పదు అని అంటున్నారు.  ఫ్యునాబషీ సిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కార్యాలయంలో ఈ కొత్త నిబంధనను కచ్చితంగా అమలు పరుస్తున్నారు.  2019 మే-ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో  ఉద్యోగులు 300 కి పైగా ‘తొందరబాటుగా  వెళ్లిన’ లాగ్స్ రికార్డయ్యాయట. త్వరగా వెళ్లేందుకు చాలామంది ఉద్యోగులు రికార్డుల్లో  తప్పుడు టైమింగ్స్ వేశారట , ఈ విషయాన్నీ ఆ  సంస్థ యాజమాన్యం పసిగట్టింది.

ఇక ఈ  విషయంలో జూనియర్ ఉద్యోగుల  కన్నా సీనియర్ ఉద్యోగులు ముందున్నారట. దీనికి  ఉదాహరణగా  55 ఏళ్ళ ఓ మహిళా ఉద్యోగినికి  వచ్ఛే మూడు నెలలకు ఆమె శాలరీలో కొంత కట్ చేస్తామని యాజమాన్యం చెబుతోంది. సాయంత్రం 5 గంటల 15 నిముషాల వరకు ఆఫీసులో ఉండాల్సిన ఆమె..ప్రతి రోజూ  రెండు నిముషాలు ముందుగా ఆఫీసు వెళ్ళిపోతుందని కనిపెట్టారు.  ఈ విషయంపై   యాజమాన్యం రాతపూర్వకంగా హెచ్చరించింది.  మరో నలుగురికి కూడా   వార్నింగులు చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button