ఈ హోటల్లోకి మగాళ్లు ప్రవేశిస్తే ముఖాలు పగలడం ఖాయం !

మన దేశంలోనే కాదు , ప్రపంచంలో ఉన్న అన్ని హోటల్స్ లో స్త్రీలతో పటు పురుషులకు కూడా ప్రవేశానికి అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడి హోటల్ మాత్రం అన్ని హోటల్స్ కి విరుద్దంగా ఉంది. మరి ఈ హోటల్ ఎక్కడో చూద్దామా ….
స్పెయిన్ లోని బాలెయారిక్ అనే దీవిలో ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ పేరు ‘సోమ్ డోన్ హోటల్’ , అంటే ‘మేము మహిళలం ‘ అని అర్థమట. ఈ హోటల్ లో ఉండాలంటే మహిళలు 14 ఏళ్ళ వయసు దాటి ఉండాలి.
కొన్ని రోజులు మగాళ్లకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకొనే మహిళలకు ఈ హోటల్ ఎంతో ఉపయోగపడుతుందని హోటల్ నిర్వాహకులు అంటున్నారు.
మహిళల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఈ హోటల్ సెక్యూరిటీ చూసుకుంటుంది అని యాజమాన్యం తెలిపింది.
మరి పురుషులకు పరిమిషన్ లేని హోటల్ లో పనివారు మాత్రం మహిళలతో పాటు మగవారు కూడా ఉన్నారు. ఎందుకంటే స్పెయిన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధిలో వివక్ష ఉండరాదనే ఉద్దేశంతో కొంతమంది పురుషులకు ఈ హోటల్‌లో ఉద్యోగం కల్పించారు.
కానీ వారికీ ఆ హోటల్ యాజమాన్యం అమ్మాయిల విషయంలో ఎలా మసలుకోవాలో చెప్పి కఠిన నిబంధనలను పెట్టింది.