Tollywood news in telugu

రాత్రి 7 గంటలకి నా పిల్లలు ఇలా చేయకుంటే… రేణూ దేశాయ్ ఓపెన్ కామెంట్స్

renudesai instagram

రేణుదేశాయ్ , పవన్ కళ్యాణ్ ఎంతగానో ఇష్టపడి పెళ్లిచేసుకున్న వ్యక్తి. రేణుదేశాయ్ మీడియా ముందుకు రావడం చాలా అరుదు.  కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తననికి సంబందించిన విషయాలను, పిల్లలకు సంబదించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే సమాజంలోని సమస్యలు, ఇలా ప్రతీ ఒక్క అంశంపైనా స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా రేణూ దేశాయ్ ధర్మం, హిందూ ధర్మం, దేశంలోని పరిస్థితులు, సెక్యూలరిజం గురించి చాల బాగా చెప్పారు. 

రేణూ దేశాయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ….  ధర్మం అంటే మనిషి నమ్మకం.  జీవన విధానం, మనం ఎలా ఉండగలుగుతున్నాం,  మనం వేనిటీని  నమ్ముతున్నాం.. ఏం పనులు చేస్తున్నాం అనేదే ధర్మం. తల్లిగా కూడా ఒక  ధర్మం ఉంటుంది. ఇంటిని చక్కబెట్టుకోవడం,  పిల్లలను చూసుకోవాలి.. వారిని బాధ్యతగా పెంచడం  లాంటి ధర్మాలు ఉంటాయి.

నేను  హిందూ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకంటూ కొన్ని ధర్మాలుంటాయి. అదే ఓ ముస్లిం కుటుంబంలో పుడితే వారి రి పద్దతులు కూడా పాటించాల్సిందే. అదేవిదంగా  క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి ఉంటే ప్రతీ ఆదివారం చర్చ్‌కు వెళ్లాల్సిందే, కానీ నేను హిందువును కాబట్టి నా ధర్మాలను నేను తూచాతప్పకుండా పాటిస్తున్నాను. నా ధర్మం గురించి నేను చెబుతున్నాను. అంటుంది రేణు దేశాయ్.

హిందూ దర్మం ప్రకారం నా ఇంట్లో నేను ప్రతీ రోజూ సాయంత్రం 7 గంటలు అయితే చాలు ఇంట్లో  దీపం పెడతాను.  నా పిల్లలు సాయంత్రం 7 గంటలకు ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చి సాన్నం చేసి హారతి తీసుకుని దేవుడికి దండం పెట్టాలి. ఇలా మా ఇంట్లో తప్పకుండ  విధిగా జరగాల్సిన పని. దాంట్లో అస్సలు  కాంప్రమైజ్ కాను. ఈ  విషయంలో పిల్లలకు నాకు  గొడవ  వచ్చింది. ‘అందరూ ఆడుకుంటున్నారు.. నువ్ మాత్రం ఇలా చేస్తావ్.. ఇలా ఉంటావ్’ అని పిల్లలు నన్ను అన్నారు. రోజూ మొత్తంలో 24 గంటలు ఉంటే.. కేవలం 5ని,,లు  దేవుడి కోసం  కూడా ఎటాయించలేరా అని  పిల్లలతో వాదిస్తే.. వారు కూడా ఒప్పుకున్నారు. అప్పటినుండి ప్రతీ రోజు సాయంత్రం  7 గంటలకు  పూజా.. ఎనిమిదింటిలోపు భోజనం అయిపోతుంది అని తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button