Jangoan MLA: బండి సంజయ్ ఆ పని చేస్తే.. నేను నడి రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరుగుతా…!
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి బీజేపీ బలపడుతుంది ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో అధికార పార్టీ పై బీజేపీ ఘన విజయం సాధించాడంతో పాటు… జిహెచ్ఎంసి ఎన్నికల బీజేపీ సత్తా చాటింది.దీంతో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అన్ని నిరూపించింది.

గత కొద్ది రోజుల నుండి బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య కేంద్ర నిధులు పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రనికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన లక్ష 30 వేల కోట్ల నిధులను ఎగకొట్టిందని ఆరోపించారు ఒక వేళ ఇది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,హోమ్ మంత్రి కిషన్ రెడ్డి ఇది నిజం కాదని నిరూపిస్తే..తాను జనగామ నియోజకవర్గంలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తానని ఎమ్మెల్యే సంచలన సవాల్ విసిరారు.

గత కొద్ది రోజుల నుండి టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో జనగామ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారింది