మహిళా ప్రేక్షకులకి విలన్ గా మారిన ఆ కుర్ర హీరో
మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు dulqur salman తన తండ్రికి ఉన్న ఇమేజ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొద్దిరోజుల్లోనే తండ్రికి తగ్గ తనయుడుగా కోలీవుడ్‌లో మంచి పేరును సంపాదించుకున్నాడు. అంతే కాకుండా “ఒకే బంగారం” తో అంటూ తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. ఆ తరువాత మహానటి సావిత్రి గారి జీవితo ఆధారoగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా ద్వారా టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇందులో శివాజీ గణేశన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు దుల్కర్. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాత్ర కోసం దుల్కర్ తెలుగు నేర్చుకొని స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. రీసెంట్ గా కార్వాన్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.
మాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఇన్ని భాషల్లో నటిస్తున్నవాళ్లలో dulqur salman తప్ప మరొకరు లేరనే చెప్పాలి. తాజాగా ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడoట ఈ 32 ఏళ్ళ కుర్ర హీరో. అంతే కాదండోయ్ మహిళా ప్రేక్షకులు అంతా షాక్ అయ్యే మరో న్యూస్ దుల్కర్ కి 28 ఏళ్ళ వయసులోనే పెళ్లి అయ్యిందంట. ఇతనిది అరేంజ్డ్ మ్యారేజ్ అంట. తనకి 15 నెలల అందమైన పాప కూడా ఉందంట. తన వైఫ్ తన బెస్ట్ ఫ్రెండ్ కూడా అని చెప్తున్నాడు కూడా ఈ కుర్ర హీరో. అంతే కాదండోయ్ తను నటించిన మహానటి సినిమా చూసిన కొందరు లేడీ ఆడియన్స్ తనకు ఐ హేట్యూ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారని కూడా dulqur salman చెప్పాడు.
నా పాత్ర నెగెటివ్‌గా ఉండటంవల్ల వారికి నేను విలన్ గా కనిపించి అలా స్పందించారు. ఒకేలాంటి సినిమాల్ని చేస్తూ పోతే ఎక్కువ సినిమాలు చేయలేను. ఆ సినిమాలో నాది నెగెటివ్ రోలే కానీ అది చాలా ముఖ్యమైనది. దానికితోడు ఆ మూవీలో వర్క్ చేసినవారు కూడా అందరు యoగ్ పీపుల్. అందుకే ఆ ప్రాజెక్టు ఒప్పుకున్నాను. నేను చేసిన సినిమా హిట్ అవ్వాలని కాదు, ఒక మంచి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటాను’’ అని కూడా దుల్కర్ చెప్పుకొచ్చాడు. హిందీలో ‘కార్వాన్’తో హీరోగా పరిచయమయ్యాను. స్కూల్ రోజుల్లో ఫ్రెండ్స్ ద్వారా హిందీ నేర్చుకోవడం నాకు ఇప్పుడు ఉపయోగపడింది. ప్రస్తుతం హిందీలో ‘జోయా ఫ్యాక్టర్’ చేస్తున్నాను. త్వరలోనే మరో తెలుగు సినిమాలో నటిస్తానని తెలిపారు.