technology information

మీ Android స్మార్ట్ ఫోన్ అన్లాక్ చేయడం ఎలా?

ఈ స్మార్ట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, ఫొటోస్ ఏదైనా ఉన్నడేటాను రక్షించడానికి లేదా ఏదైనా అన్ ఆథరైజడ్ యాక్సెస్ ని  నిరోధించడానికి PIN, పాస్వర్డ్ లేదా పాట్రన్ వంటి వాటిని Android స్మార్ట్ ఫోన్ లో మనం తరచు స్క్రీన్ లాక్ ని ఉపయోగిస్తారు. మనం పెట్టుకునే ఈ లాక్ సిస్టం మరొకరు గెస్ చేయడానికి వీలేకుండా క్లిష్టమైన పాస్ వర్డ్ లేదా పాట్రన్ ఉపయోగించడానికి నిపుణులు ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తారు. కానీ, కొన్నిసార్లు క్లిష్టమైన పాస్వర్డ్ ని కూడా సులభంగా గుర్తుంచుకోవడం కష్టం అవడంవల్ల మర్చిపోతుoటాము. ఒకవేళ మీరు ఇదే పరిస్థితిలో ఉన్నట్లయితే , మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ని అన్ చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం:

మెథడ్ 1: Android డివైస్ మేనేజర్ ని ఉపయోగించడం

మీ PC లేదా ఫోన్ లో  ‘https://myaccount.google.com/find-your-phone-guide ని ఓపెన్ చేయండి.

  1. ఇప్పుడు, మీ ఫోన్ కి లింక్ చేయబడిన మీ Google అకౌంట్ కి లాగిన్ అవ్వండి.
  2. లాగిన్ అయిన తర్వాత, మీరు లిస్టు నుండి అన్లాక్ చేయాలనుకునే మీ డివైస్ ని సెలెక్ట్ చేసుకోండి.
  3. నెక్స్ట్ స్క్రీన్ లో , ‘మీ ఫోన్ లాక్’ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
  4. ఇప్పుడు, మీ ఫోన్లో మీ పాత PIN, నమూనా లేదా పాస్వర్డ్ ని రీప్లేస్ చేయడానికి క్రొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి.
  5. కింద వైపు ఉన్న ‘లాక్’ బటన్ పై క్లిక్ చేయండి.
  6. మీ స్మార్ట్ ఫోన్ లోకి ఎంటర్ అయ్యి మరియు అన్ని కొత్త స్క్రీన్ లాక్ ని అన్లాక్ చేయడానికి మరియు మీ కొత్త పాస్వర్డ్ ని ఉపయోగించండి.

మెథడ్ 2: ‘Ok Google’ వాయిస్ మ్యాచ్ ని  ఉపయోగించడం

మీరు సరిగా మీ Google అసిస్టెంట్ ని సెటప్ చేసి ఉంటే, ‘వాయిస్ తో అన్లాక్’ ఆప్షన్ ని  మీరు గమనించి ఉంటారు. ఈ ఫీచర్స్ మీరు ముందుగా రికార్డు చేసిన వాయిస్ ఆధారంగా పని చేస్తాయి. ఒకవేళ ఈ ఫీచర్ ఆన్ చేయబడితే, మీరు మీ స్మార్ట్ ఫోన్ ని అన్లాక్ చేయడానికి ‘Ok Google’ చెప్పవచ్చు.

మెథడ్ 3: శామ్సంగ్ వినియోగదారుల కోసం

మీరు ఒకవేళ మీ శామ్సంగ్ అకౌంట్ తో మీ శామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ ని సమకాలీకరించినట్లయితే, ఈ స్టెప్స్ ని ఫాలో చేయండి:

‘Https://findmymobile.samsung.com/’ ఓపెన్ చేయండి మరియు ID మరియు పాస్వర్డ్ ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

‘అన్లాక్’ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని, మీ స్మార్ట్ ఫోన్ ని అన్లాక్ చేయడానికి మీ అకౌంట్ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button