technology information

how to manage storage in gmail

how to manage storage in gmail

how to manage storage in gmail

Gmail నేడు ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉపయోగించే ఈ-మెయిల్ సేవల్లో ఒకటి. ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ మాధ్యమం మరియు వివిధ మోడ్స్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. కాని ఇందులో కూడా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఒక సమస్య ఉంది, అదే స్టోరేజ్ ని మేనేజ్ చేయడం. జిమెయిల్ మనకు అందించే 15GB స్టోరేజ్ స్పేస్ ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఆ తర్వాత మనం స్టోరేజ్ పొందడం కోసం Google నుoడి కొనుక్కోవలసి వస్తుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే Gmail లో లిమిటెడ్ గా ఉన్న స్టోరేజ్ ని మరింత సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ని ఫాలో అయితే చాలు.

  1. 1. Gmail ను ఓపెన్ చేయాలి.
  2. క్రిందికి స్క్రోల్ చేయాలి మరియు మీరు ఎంత స్టోరేజ్ యూస్ చేసారో చూస్తారు. క్రింద రాసి ఉన్న “మేనేజ్” ని ఎంచుకోవాలి.
  3. దీన్ని క్లిక్ చేసి, డ్రైవ్ స్టోరేజ్ అనే పేజీకి వెళ్ళాలి. ఇక్కడ, మీరు ఎంత స్టోరేజ్ ని యూస్ చేసారు అనే ఒక పై చార్ట్ ని చూస్తారు మరియు అడిషనల్ స్టోరేజ్ ని కొనుక్కోవడానికి ఏయే ప్లాన్స్ ఉన్నాయో చూడొచ్చు.
  4.  పై చార్ట్ క్రింద ఉన్న వ్యూ డీటెయిల్స్ ని ప్రెస్ చేయాలి.

5.ఇలా చేయడం ద్వారా Google డ్రైవ్, Gmail మరియు ఫోటోస్ కోసం ఎంత స్టోరేజ్ ఉపయోగించారు అనేది తెలుసుకోవచ్చు.

  1. “లెర్న్ మోర్” అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి.
  2. ఇది Google డ్రైవ్ హెల్ప్ అనే పేజీకి తీసుకెళుతుంది. ఇక్కడ స్టోరేజ్ ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే దానిపై చాలా రకాల సలహాలను పొందవచ్చు.
  3. ట్రాష్ లో చాలా ఎక్కువ అంశాలను కలిగి ఉంటే, drive.google.com కి వెళ్ళాలి. దీని తర్వాత, ఎడమవైపు ఉన్న ట్రాష్ పై క్లిక్ చేయాలి. ఒకసారి ఇక ఎప్పటికి ఆ ఫైల్స్ అవసరం లేదు అనుకుంటే ‘ఎంప్టీ ట్రాష్ ‘ పై క్లిక్ చేయాలి, వీటిని తిరిగి రికవర్ చేయలేము.
  4. గూగుల్ డ్రైవ్ హెల్ప్ యొక్క సెక్షన్ లో కూడా ఒక లింక్ ఉంది. ఆప్షన్ 1. క్లియర్ స్పేస్’ ఇది ఫైల్స్ లో ఏది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందో అనే లిస్టు చూపిస్తుంది. ఈ లిస్టును చూసి ఏ ఫైల్స్ వీటిలో యూస్ లేదు అని అనుకున్న వాటిని డిలీట్ చెయ్యొచ్చు.
  5.  ఫోటోస్ చాలా స్పేస్ అక్యుపై చేస్తుంటే, Google డ్రైవ్ హెల్ప్ లో ఉన్న ‘లెర్న్ మోర్ అబౌట్ ఫోటో స్టోరేజ్ కి వెళ్ళాలి. సేవ్ చేయబడిన ఇమేజస్ క్వాలిటీని అడ్జస్ట్ చేయడానికి లింక్స్ కలిగి ఉన్న క్రొత్త పేజీకి వెళ్ళొచ్చు.

11: Gmail లో ట్రాష్ మరియు స్పామ్ ఫోల్డర్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఇవి కూడా ఎక్కువ స్పేస్ తీసుకుoటాయి, ఇంపార్టెంట్ కానటువంటి ఈ-మెయిల్స్ ని డిలీట్ చేసుకుంటే మంచింది.

సో ఫాలో ది స్టెప్స్ అండ్ మేనేజ్ యువర్ స్టోరేజ్ ఇన్ Gmail.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button