శరీరాన్ని ఆయిల్‌తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు..
నువ్వులనూనె, కొబ్బరి నూనె, ఆముధం, ఆవు నెయ్యి ఇతర ఔషద గుణాలున్న తైలాలతో తల, శరీరం అంతటా మర్దన చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం వారంలో ఒక్కసారైనా ఆయిల్‌తో శరీరాన్ని మర్ధన చేసుకుంటే కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..
తైలంతో తలకు మర్ధన చేసుకోవడం వలన కంటి, జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. తలనొప్పి కూడా తగ్గుతుంది.

నూనెతో శరీరాన్ని మర్ధన చేసుకోవడం వలన శరీరం కాంతివంతంగా మారుతుంది. శరీర మర్ధన వలన శరీరం నుంచి మలినాలు విసర్జింపబడి చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.
అరికాళ్లకు నూనెతో మర్ధన చేయడం వలన అరికాళ్ల మంటలు తొలగుతాయి. కండ్ల వేడి తగ్గి కండ్లు చల్లబడతాయి. పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. నిద్రలేమి, శారీరక శ్రమ తొలగి సుఖనిద్ర పడుతుంది.
చర్మం మృదువుగా అందంగా మారి, వయసు మీద పడటం వలన వచ్చే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కీళ్లనొప్పులు, వాతపు నొప్పులు, పక్షవాతం, నరాల బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.