Teeth: ఇలా చేస్తే పసుపు పచ్చని, గారపట్టిన పళ్లను మెరిపించుకోవచ్చు
చిరునవ్వు నవ్వగానే తళుక్కున మెరిసే పళ్ల వరుస మనలో ఎంతో మందికి ఇది ఒక కల. అందమైన పళ్ల వరుసతో పాటు తెల్లని దంతాలు మనల్ని ప్రత్యేకంగా చూపుతాయి. పసుపు పచ్చని, గారపట్టిన పళ్లు మనలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మనం ఇంట్లో దొరికే వస్తువులను ఉపయోగించి మన పళ్లను మెరిపించుకోవచ్చు. అదెలాగంటే..
నిమ్మరసంలో బేకింగ్ సోడాను కలిపి, ఈ మిశ్రమాన్ని దంతాలపై వేలితో మృదువుగా రాయడం ద్వారా తెల్లని దంతాలను సొంతం చేసుకోవచ్చు.

రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ లేదా నిమ్మ తొక్కులను పళ్లపై రుద్దాలి. ఇలా చేయడం ద్వాఆ పళ్ల పసుపుదనం తగ్గుతుంది.
హైడ్రోజన్‌పెరాక్స్‌డ్, బేకింగ్‌సోడాను సమపాళ్లలో కలిపి పళ్లను తోమడం వల్ల పళ్లపై ఏర్పడే పసుపుపచ్చని పొర తొలగిపోయి పళ్లు మిలమిలా మెరుస్తాయి.
షుగర్ కంటెంట్ లేని చూయింగ్ గమ్స్‌ను నమలవచ్చు. ఇదీ దంతక్షయాన్ని అరికడుతుంది.
మంచి బ్రషింగ్ అలవాటు కూడా మన పళ్లను కాపాడుతుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండు నుంచి మూడు నిమిషాల పాటు క్రమ పద్ధతిలో బ్రష్ చేసుకోవడం ద్వారా చాలా వరకు దంత సమస్యల నుంచి దూరం కావచ్చు.