నీరసం, నిస్సత్తువ, కళ్లు బైర్లు కమ్మటం, అలసటగా ఉంటోందా.. అయితే అదే కావొచ్చు..
సాధారణ లో బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లయితే అది మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపదు. ఎప్పుడైతే మీరు ఒత్తిడికి బాగా గురవుతారో.. అప్పుడు లో బీపీ లక్షణాలు మొదలవుతాయి. ఒత్తిడి బాగా ఎక్కువయినపుడు శరీర అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. అందువల్ల శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, కిడ్నీలకు, మూత్రనాళాలకు తక్కువ రక్తప్రసరణ జరగడం మొదలైనవి లోబీపీకి ప్రధాన కారణాలు. ఇలా జీవక్రియలకు అంతరాయం జరిగిన గుండె, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.

ఆరోగ్యవంతమైన వ్యక్తి బీపీ 120/80గా ఉంటుంది. ఇది ఏమాత్రం తగ్గినా దాన్ని లో బీపీగా పరిగణిస్తారు. కూర్చోని ఒక్కసారిగా లేచిపపుడు కళ్లు బైర్లు కమ్మడం, స్పృహ తప్పడం, నీరసంగా ఉండటం, కొద్దిపాటి పనికే అలిసిపోయినట్లు ఉండటం, అతి నిద్ర వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
లో బీపీని తగ్గించడంలో బీట్‌రూట్ రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు రోజు బీట్‌రూట్ రసాన్ని తీసుకోవడం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఒకవారం రోజులు తీసుకోవడం ద్వారా, వచ్చే మార్పును మీరే గమనిస్తారు.
ఉప్పు ఆధారిత పదార్థాలను తీసుకోవడంతోపాటు, ఒక గ్లాసు ఉప్పు నీటిని కూడా తాగితే మంచిది.
లోబీపీ సమస్యతో బాధపడేవారు గుమ్మడి విత్తనాలు, కివి పండ్లు, పుచ్ఛకాయ, అరటి పండ్లు, అవిసె గింజలు, బ్రొకోలి, డార్క్ చాక్లెట్ వంటి వాటాని తరచుగా తినడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే నియమిత వేళక ఆహారాన్ని తీసుకోవడం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.