Tollywood news in telugu

FASTag: ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలు క్రాస్ చేసారో..డబుల్ చార్జెస్ కట్టాల్సిందే…!

Fastag Is Compulsory From Tomorrow

Fastag Is Compulsory From Tomorrow: దేశంలో ఫిబ్రవరి 15 నుండి ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. దేశంలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ను, అలాగే కరోనాను అరికట్టే క్రమంలో ఈ నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే విధానాన్ని చేపడుతుంది.  దీనిద్వారా ప్రజల ప్రయాణాన్ని విసుగులేకుండా అనుకున్న టైం కు గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.

 ఇప్పటి వరకు  వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫాస్టాగ్ విధానాన్ని ఇప్పటినుండి పక్కాగా అమలుచేయనున్నారు.  తాజాగా ఫిబ్రవరి 15ను కచ్చితంగా చివరి తేదీ అని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలు క్రాస్ చేసే వాహనాలు రెట్టింపు చార్జెస్ పడే అవకాశం ఉంది.

ఇంత త్వరగా ఈ ఫాస్టాగ్ ను ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా..  ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద కానీ పలు ఆన్‌లైన్ సేవల ద్వారాకానీ కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక రీచార్జ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే వెసులుబాటు కల్పించారు.

టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన స్కానర్ల ద్వారా వాహనాలకు అతికించిన ఫాస్టాగ్‌ కార్డులు స్కాన్ అవ్వడంతో ఆటోమెటిక్‌గా గేట్ ఓపెన్ ఐ త్వరగా వెళ్లిపోవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button