Today Telugu News Updates

24గంటల్లో 30 హాస్పిటల్స్ తిప్పారు, Hospitals negligence in Hyderabad

 ఒకటి కాదు , రెండు కాదు .. 27 గంటల పాటు .. Hospitals negligence in Hyderabad ఆ కుటుంబం ఏకధాటిగా నగరంలోని 30 ఆస్పత్రుల మెట్లు ఎక్కి దిగింది . తమ కుటుంబ సభ్యురాలి ప్రాణాలు కాపా డుకునేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ ప్రాధేయపడినా ఎవరూ కనికరించలేదు . ప్రతి ఆస్పత్రిలోనూ ఒకటే సమాధానం . ‘ పడకలు లేవు ‘ అని .

 ఆమె వెంట ఆక్సిజస్ సిలిండర్‌ తోనే వారు ఉరుకులు పరుగులు పెట్టినా .. లాభం లేకపోయింది . చికిత్స పూర్తి చేసుకుని ఆరో గ్యంగా నవ్వుతూ ఇల్లు చేరాల్సిన ఓ మహిళ , చివరకు ఓ మృతదేహంగా ఇంటికి చేరిన దీన ఘటన ఇది . వైద్యానికి పేరు మోసిన హైదరాబాద్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది . రాజ్ భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్తాకు చెందిన జరీనాకు ఆస్తమా ఉంది . గత నెల 26 వ తేదీన వాతావరణం మారడంతో ఆనారోగ్యం పాలైన ఆమె యునాని వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంది .

Hospitals negligence in Hyderabad ::

అది జరిగిన రెండు రోజులకే ఆరోగ్యం దెబ్బతినడంతో 28 న మధ్యాహ్నం 12,30 గంటలకు ఆమెను కుటుంబసభ్యులు ఆటోలో లక్షీకాపూల్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు . అక్కడ పడకలు లేవంటూ తిప్పి పంపించేశారు . ఆ తర్వాత ఎర్రగడ్డలోని ఓ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు . అనంతరం .. బంజారాహిల్స్ రోడ్డు నెం .1 లో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రి రూ . 5 లక్షలు కడితే చికిత్స చేస్తామని చెప్పడంతో జరీనాను తీసుకెళ్లారు . తీరా వెళ్లిన తర్వాత తమ దగ్గర ఆమెకు వైద్యం కుదరదని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పేశారు .

 అదే ప్రాంతంలో  రోడ్డు నెం .10 లో ఉన్న మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా అదే సమాధానం . అలా నగరమంతా తిరుగుతూ .. ఆదివారం అర్ధరాత్రి ఉస్మానియా ప్రభుత్వా సుపత్రికి తీసుకెళ్లారు . అక్కడి పరిస్థితులు , ఆర్తనాదాలకు భయపడిన జరీనా … ఆ చావేదో ఇంట్లోనే చస్తానంటూ వేడుకోవడంతో మెరుగైన చికిత్సకోసం మరో సారి ప్రైవేట్ ఆస్పత్రులన్నీ తిరిగారు . ఎట్టకేలకు గత నెల 29 న మలక్ పేటలోని ఓ ఆస్పత్రిలో చేర్చుకోగా … చేరిన 25 నిమిషాలకే జరీనా కన్నుమూసింది . త్వరలో కూతురి పెళ్లి పెట్టుకుని … కనీసం అది చూసేవరకైనా ఉండలేకపోయావా అంటూ జరీనా భర్త హబీబ్ రోదించడం చూపరులను కలచివేసింది . తమ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఆస్పత్రులు నిరాకరించడం వల్లే సరైన వైద్యం అందక జరీనాను కోల్పోయామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button