ఇంట్లో లభించే వాటితోనే పంటి సమస్యకు చెక్ పెట్టండిలా..
పంటి నొప్పిని చిన్న సమస్య అనుకొని చాలా మంది అసలు పట్టించుకోరు. నొప్పిగా అనిపించినపుడల్లా ఏదో ఒక వైద్యం చేసుకొని తాత్కాలిక ఉపశమనం పొందుతుంటారు. నిజానికి పంటినొప్పిని నిర్లక్ష్యం చేయడమంటేనే చేజేతులా సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. అయితే వేధించే పంటి నొప్పి నుంచి ఇంట్లో లభించే వస్తువులను ఉపయోగించి రిలీఫ్ పొందొచ్చు.
ఉప్పు నీరు..
పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఉప్పుడు వేసి ఆ నీటిని పది నిమిషాల పాటు పుకిలించి ఉంచాలి. ఇలా రోజులో వీలైనన్ని సార్లు చేయడం వల్ల పళ్ల చుట్టూ, నోటిలోని అనేక క్రిములు
నశిస్తాయి.

వెల్లుల్లి, లవంగం..
వెల్లుల్లిని, లవంగాన్నిచూర్ణంగా చేసి కొద్దిగా ఉప్పును కలపాలి. ఆ మిశ్రమాన్ని నొప్పితో బాధిస్తున్న పంటికి అప్లై చేయడం ఉపశమనం పొందవచ్చు.
మిరియాలు, ఉప్పు
మిరియాలు, ఉప్పు ఈ రెండిటిని నీటితో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నొప్పిని కలిగిస్తున్న దంతానికి నేరుగా అప్లై చేయడం ద్వారా కొన్ని నిమిషాలోలనే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
మింట్ ఆకులు
తాజా పుదీనా ఆకులు నమలడం ద్వారా పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనాకు మిరియాల లాగానే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.