hindu marriage act : వివాహం-విడాకులు విషయంలో చట్టం ఏం చెబుతుంది…! భార్యకు , భర్త భరణం చెల్లించడం విన్నాం, కానీ.. భర్తకు, భార్య భరణం ఎపుడు చెల్లిస్తుందో తెలుసా …?
hindu marriage act : వివాహం చేసుకున్న ప్రతీ ఒక్కరు చట్టప్రకారం రిజిస్టర్ చేయించుకోవలసి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేయించుకున్న సర్టిఫికెట్ మనకు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ చాలామంది మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడంలో అశ్రద్ధ చూపుతూ ఉంటారు.
కేవలం విదేశాలకు వెళ్లే సమయానికో, మరేదైనా అవసరం పడ్డపుడుగాని ఈ సెర్టిఫికెట్ గుర్తుకురాదు . ఇంకా ఆ సర్టిఫికెట్ తో ఉన్న ఉపయోగాలు తెలీదు కాబట్టి చాల మంది ఈ సర్టిఫికెట్ తీసుకోడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం జరుగుతుంది.

హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు …
1. భారత దేశంలో హిందు మ్యారేజ్ చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకోడానికి అర్హులు, ఒక్కరికంటే ఎక్కువ చేసుకోవడానికి అవకాశంలేదు. అలా చేసుకుంటే చట్టప్రకారం శిక్షార్హులు అవుతారు.
2. మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అబ్బాయికి 21సం, అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తీ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. మైనర్లని వివాహం చేసుకుంటే వారు చట్టరిత్యా నేరం చేసినవారు అవుతారు.
3. మత ,ప్రాంత, కులాలకు అతీతంగా వివాహాలు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నవారికి సపరేట్ యాక్ట్ కింద పరిగణిస్తారు.
4. వివాహం అనంతరం వధువు అత్తవారి ఇంట్లో ఉండాలని, చట్టంలో తెలియపరచలేదు. ఏళ్లతరబడి కొనసాగుతూ వస్తుంది కాబట్టి అలాగే పాటిస్తున్నాం. అలాగే ఇల్లరికం అల్లుడి కి సంబంధించి కూడా ఎలాంటి ఆంక్షలు చట్టంలో లేవు.

5. పెళ్లి జరిగాక ఏదైనా పరిస్థితుల కారణంగా సంవత్సరం లోపు విడిపోవాల్సి వస్తే దానికి చట్టం ఒప్పుకోదు.
6. ఇద్దరి మధ్య రాజి కుదర్చడానికి కారణాలు లేకపోతె మాత్రమే విడాకులు మంజూరు అవుతాయి.
7. అలాగే విడాకులు మంజూరు ఐన తరవాతే మరో పెళ్లి చేసుకోల్సి ఉంటుంది. లేదంటే చట్టప్రకారం ఆ వివాహం చెల్లకపోగా, నేరం చేసినవారవుతారు.
8. విడాకులు తీసుకున్నాక పిల్లల బాధ్యత పూర్తిగా ఆ తల్లిదండ్రులపైన ఉంటుంది. వారి ఆస్తుల విషయంలో పిల్లలకు హక్కు ఉంటుంది.
9. బార్యాభర్తలిద్దరిలో ఒకరు మాత్రమే విడాకులు కోరితే దానికి చట్టం ఒప్పుకోదు.
10. ఇక ఇద్దరు వివిధ కారణాల వల్ల విడిపోతే, భరణం అనేది భర్తకు ఉన్న స్థోమతపై ఆధార పడి ఉంటుంది. ఒక వేళా భర్త దీన స్థితిలో ఉండి , భార్య ఆర్థికంగా బాగుంటే అపుడు భార్యే, భర్తకి భరణం చట్టప్రకారం ఇవ్వాలి.