దుబ్బాక నుంచే టిఆర్ఎస్ రాజకీయ సమాధి, high drama in dubbak polls
దుబ్బాక నుంచే టిఆర్ఎస్ కు రాజకీయ సమాధి.. high drama in dubbak polls బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ దుబ్బాక ఉప తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ రాజకీయ సమాధి చేస్తుందని మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాద్యక్షుడు రాబోతుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు . మంగళవారం నాడు జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై దాడికి నిరసిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్మ , రాస్తారోకోను నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిని చవచూస్తుందని గ్రహించి బీజేపీ అబ్యర్ధి అయిన రఘునందన్ ఇంట్లో పోలీసులు డబ్బులు పెట్టి సోదాను నిర్వహించి ఆ బాసుపాలు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు . దాంతో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తుండగా దాడులు , అరెస్టు చేస్తూ ప్రజలను భయభ్రాంతులపై గురిచేసిన పోలీసులు , టీఆర్ఎస్ పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఇంటలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి హరీష్ రాన్లు పోలీసులు చేత దాడికి పురమాయించి తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు . శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కుట్రలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతుందని , ప్రజాస్వామ్యం తలదించుకునేలా చేసిన టీఆర్ఎస్ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు . అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి హరీష్ రానే దిష్టి బొమ్మలను బీజేపీ నాయకులు దహనం చేశారు .
high drama in dubbak polls ::
దుబ్బాక ఎన్నికలకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయ డం అప్రజాస్వామికమని బిజెపి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగంధర్ అన్నారు . మంగళవారం భూ పాలపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్ సెంటర్లో బిజెపి బండి సంజయ్ , మాజీ ఎంపి వివేట్లను అరెస్టుకు నిరసనగా ధర్నా , రాస్తారోకో నిర్వహిం చారు . ఇకనైనా టిఆర్ఎస్ వారి తీరును మర్చు కొక పోతే అసెంబీ , ప్రగతి భవన్ ని బిజెపి ఆధ్వ ర్యంలో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్‌రెడ్డి , ఓబిసి జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ , బిజెపి సీనయర్ నాయకులు బట్టు రవి రూరల్ మండల అధ్యక్షుడు ఇచంతల విష్ణు పట్టణ ఉపద్యు అక్షుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు .
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ అన్నారు . మంగళవారం డివిజన్ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన చేప ట్టారు . దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి భయంతోనే బిజెపి కార్యకర్తలపై భౌతిక దాడు లకు పాల్పడుతోందన్నారు .