Advocates Murder: హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల దారుణ హత్య..!

High Court Advocates Murder: పెద్దపల్లి జిల్లా , రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్రావు, నాగమణి దంపతులు కారులో హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో , కారు ఆపి దంపతులిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పారిపోయారు.
మంథని కోర్టులో ఓ కేసుకు విషయంలో వచ్చిన వామన్ రావు, నాగమణి దంపతులు తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా.. కల్వచర్ల శివారులో కారును అడ్డుకొని ఇద్దరిపై కత్తులతో దాడి చేసి, తీవ్రంగా గాయపరచగా.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకు ని ఇద్దరిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దంపతులిద్దరికీ చికిత్స జరుపుతున్నపుడే, మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. గట్టు వామన్ రావుది మంథని మండలంలోని గుంజపడుగు గ్రామం. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న పలు అక్రమాలపై హైకోర్డులో ఫిల్స్ వేశారు గట్టు వామన్రావు నాగమణి. ఈ విషయంలోనే కక్షగట్టి నిందితులు దాడిచేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే ఈ దంపతులిద్దరూ వారికీ ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టీస్ కు కూడా వెల్లడించారు. అలాగే శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు వామన్ రావ్. ఈ కేసు వాపస్ తీసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు బెదిరింపులకు గురిచేసారు.
గతంలో వామన్ రావ్ ఎమ్మెల్యే పుట్ట మధుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . అయితే వారం రావు చనిపోయే ముందు ఎవరో ఒక యువకుడు అడుగగా తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ అని తెలిపాడు. ఈ కేసు విషయం లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.