Today Telugu News Updates
Shruti hasan: ప్రభాస్ “సలార్” చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్?

Shruti hassan: బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు గత ఏడాది విడుదలైన సాహో చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో సలార్ అనే చిత్రం రాబోతుంది.

తాజాగా ఈ సలార్ చిత్రంలో హీరోయిన్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం సోలార్ చిత్రంలో హీరోయిన్ గా దిశాపటానిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ చిత్రంలో లీడ్ రోల్ లో శృతిహాసన్ నటించబోతున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డైరెక్టర్ ప్రశాంత్ అని శృతి హాసన్ ని ఆశ్రయించి కధ చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి శృతిహాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో ముందుముందు చూడాలి.