Tollywood news in telugu
Samantha: ఆ ఫోటో షేర్ చేసిన కొద్ది క్షణాలకే.. పోస్ట్ ను డిలీట్ చేసిన సమంత…కారణమేంటటే?

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత యువసామ్రాట్ నాగచైతన్య తో వివాహమైన తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన.. ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఏ విషయం అయినా ప్రేక్షకులతో పంచుకుంటుంది.

తాజాగా సమంత తన డ్రెస్ స్టైలిస్ట్ ప్రీతం జుకలకర్ తో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సమంత పడుకొని తన స్టైలిష్ ప్రీతం పై కాళ్ళు పెట్టి పడుకొని ఉంది. దీన్ని చైతు అభిమానులు ఈజీగా తీసుకోలేదు.. సమంత పై చైతు అభిమానులు ఫైర్ అవడంతో సమంత ఆ పోస్ట్ ను వెంటనే డిలీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.

తాజాగా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ అమెజాన్ లో త్వరలో విడుదల కానుంది. ఇంకా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుంది.అలాగే హీరో విజయ్ సేతుపతి తో కలిసి ఓ సినిమా చేయబోతుంది.
