హీరో సుమన్ తో కృష్ణంరాజు గొడవ !

Hero suman: టాలీవుడ్ లో స్టార్ హీరోలైన సుమన్ కృష్ణంరాజు కలిసి పలు చిత్రాల్లో నటించిన విషయం అందరికి తెలిసిందే.. ఈ సందర్భంగా కృష్ణంరాజు సుమన్ పై అలిగి వెళ్లిపోయారట? ఈ విషయం మీకు తెలుసా…?
అప్పట్లో సినిమాలో పోస్టర్స్‌లోని పేర్లు, టైటిల్ కార్డ్స్‌లో వేసే పేర్లలో తమ పేరు ముందు ఉండాలని హీరోలు పట్టుబట్టేవాళ్లు… ఆదే సమయంలో “లీడర్” చిత్రంలో సుమన్ కృష్ణంరాజు నటిస్తున్నారు… ఈ మేరకు అప్పట్లో సుమన్ హీరోగా స్టార్ ఇమేజ్ ఎక్కువ ఉండడంతో… ఆయన పేరే మొదట వేశారు.. దీంతో కృష్ణంరాజు తన పేరు వెనుక వేశారని అని అభిమానులు మనస్థాపానికి గురి అవుతారని కృష్ణంరాజు మూవీ సెట్ లో నుండి అలిగి వెళ్లిపోయారు… ఈ విషయం తెలుసుకున్న సుమన్ కృష్ణం రాజు పేరే మొదట వేయాలని దర్శకుడికి చెప్పాడు… మళ్లీ ఎలాగోలా కృష్ణంరాజుకి నిర్మాత సర్దిచెప్పడంతో… మూవీ సెట్ లోకి కృష్ణంరాజు వచ్చేశారు… దీంతో ఈ వివాదం అక్కడితో ముగిసింది