యూట్యూబ్ ఛానళ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రానా !

ప్రపంచమంతటా లాక్ డౌన్ నేపథ్యంలో, సినిమా హాళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలందరూ ఓటిటి వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిదంగా యూట్యూబ్ కి అలవాటు పడినవాళ్లు అమాంతంగా పెరిగిపోయారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు , తన అభిమానులకు , అందుబాటులో ఉండేందుకు రానా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. ఈ ఛానల్ పేరు ‘సౌత్ బే’ గా నిర్ణయించారు.
ఇందులో 10 సెకన్ల నుంచి 10 గంటల నిడివితో కొన్ని భాషలకు సంబందించిన కథలు అందుబాటులో ఉంటాయి. ట్యాలెంట్ వున్న ప్రతీ ఒక్కరికి తగు అవకాశాలను ఈ ఛానెల్ లో కల్పించబోతున్నారు.
కేవలం కథలే కాకుండా వార్తలు, యానిమేషన్, ఫిక్షన్ అంశాలకు సంబంధించిన వి కూడా ఈ ఛానల్ లో ఉండనున్నాయి.
RANA'S #YOUTUBE CHANNEL… #RanaDaggubati ventures into content creation, launches #YouTube channel: #SouthBay… The platform will offer multilingual stories from 10 seconds to 10 hours… Will cover unscripted celebrity content, music, news, animation, fiction and more. pic.twitter.com/7Mw3WaXFZp
— taran adarsh (@taran_adarsh) November 9, 2020