Tollywood news in telugu

హావా సినిమాకు వస్తున్న రెస్సాన్స్ చాలా బాగుంది… హీరో చైతన్య 

క్రైమ్ కామెడీ సినిమాలకు డిమాండ్ తగ్గలేదు, ప్రేక్షకుల నుండి ఆదరణ తగ్గలేదు అని నిరూపిస్తున్న సినిమా ‘హావా’
కొత్త కాన్సెప్ట్ తో ఎప్పుడూ చూడని లోకేషన్స్ లో నిర్మాణం జరుపుకున్న హావా ఈ రోజు రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన
తెచ్చుకుంటుంది. ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ తో ఆనందంగా ఉంది చిత్ర యూనిట్ . ఈ రోజు రిలీజ్ అయిన ‘హావా’ సినిమా ప్రేక్షకుల
మద్య చూసి అక్కడి చూసిన రెస్సాన్స్ ని మీడియాతో పంచుకుంది చిత్ర యూనిట్ .
ఈ సందర్భంగా హీరో చైతన్య మాట్లాడుతూ:
‘మా నమ్మకాన్ని ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నిలబెట్టింది. థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు పడ్డ కష్టం, టెన్షన్ అంతా
పోయింది. మేము పెద్దగా ఎక్స్ పెక్ట్ చేయని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయి నవ్వుతున్నారు. ఈ సినిమా చాలామంది కల.
ఆస్ట్రేలియాలో షూటింగ్ అప్పుడు మేము ఏదైతే నమ్మి అడుగు ముందకు వేసామో ఆ నమ్మకం ఈ రోజు నిలబడినందుకు చాలా సంతోషంగా
ఉంది’ అన్నారు.
డైరెక్టర్ మహేహ్ రెడ్డి మాట్లాడతూ:
‘కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్  చాలా ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా మా టీం మొత్తానికి చాలా ఇంపార్టెంట్.
ఈ సినిమా కోసం మేము చాలా ట్రెవెల్ చేసాము. మేము నమ్మిన కథ తెరమీద ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధానం చాలా పాజిటివ్ గా ఉంది.
థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడా గ్రిప్పింగ్ తగ్గని కథనం ‘హావా’ ని ప్రేక్షకులు ఎంటర్ టైన్ అయ్యేలా చేసింది.
ఈసినిమాలో నటించిన చైతన్య, దివి పాత్రలకు చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ ’అన్నారు.
చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటిస్తుండగా.. స్టీఫెన్ మర్ఫీ, ఫోబ్ జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, జో జోసెఫ్, అంజా
మేయెర్, ఆల్వోన్
జూనియర్, విలియమ్ ట్రాన్, శ్రీజిత్ గంగాధరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో ఉన్న
ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని, సంగీతం : గిఫ్టన్ ఎలియాస్, పిఆర్వో
: జి.ఎస్.కే మీడియా, నిర్మాణం
: ఫిల్మ్ అండ్ రీల్ , దర్శకత్వం : మహేష్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button