Tollywood news in telugu

Hero Arya clean chit : తనపై ఉన్న కేసులనుంచి క్లీన్ చిట్ పొందిన ఆర్య:-

Hero Arya clean chit : మనందరికీ భాషతో సంబంధంలేకుండా సినిమాలు చూసే హీరోలలో టాప్ పొజిషన్ లో ఉండే హీరో ఆర్య. ఈ మధ్యకాలంలోనే సర్పాటా పరంపర తో ఘానా విజయం సాధించారు. అదే సమయంలో తండ్రిగా కూడా ప్రమోషన్ కొట్టేసిన విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉండగా చాల నెలలుగా ఆర్య మీద ఒక కేసు నడుస్తుంది. ప్రస్తుతం జర్మనీ లో జీవిస్తున్న ఒక యువతీ పెట్టిన కేసు అది. ఆమె పేరు విద్జ. ఈమె శ్రీలంక లో జీవనం కొనసాగిస్తున్న సమయంలో ఆర్య తనని పెళ్లిచేసుకుంటానని చాటింగ్ చేసి 70 లక్షలు తీసుకున్నాక సాయేషా ని పెళ్లిచేసుకోవడం తో మొదలయింది ఈ వివాదం.

అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. అయినా సరే ఆర్య ఆ మోసం చేయలేదని , ఆర్య తో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ చూపించిన అది నేను కాదు అని ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. ఇక పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపడం మొదలుపెట్టాక ఇన్నాళ్లకి నిజానిజాలు బయటపడ్డాయి.

అదేంటంటే ఆర్య పేరు మీద చెన్నైలోని పులియంతోప్ కు చెందిన అర్మాన్, హుస్సేనీ అనే ఇద్దరు యువకులు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇంత కథ నడిపించిన మహానుభావులే ఈ రచ్చ కు అసలైన కారణం. వీళ్ళు అడ్డంగా దొరికిపోవడం తో ఆర్య తప్పేంలేదు అని చెన్నై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చేశారు.

ఈ ఆనందమైన సమయంలో ఆర్య తన క్లుప్తమైన సమయంలో తోడుగా ఉన్న ప్రతి ఒకరికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. మొత్తానికి ఆర్య అన్ని వివాదాలనుంచి బయటపడి అటు భార్య పాపతో ఇటు షూటింగులో బిజీ అయిపోయారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button