technology information

Top Best Selling Bikes: ఇండియాలో ఎక్కువ అమ్ముడవుతున్న టాప్ -10 టూవీల్లర్స్ మరియు వీటి ధరలు మీకోసం… !

Best Selling Bikes in India

Best Selling Bikes in India: ప్రస్తుత తరుణంలో కరోనా కారణంగా జనాలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వెళ్ళడానికి భయపడుతున్న సమయంలో, ప్రజలు ఎక్కువగా టూ విల్లర్స్ కొంటున్నారు. పైసా పైసా  కూడబెట్టి మరి ఇంటిముందు ఒక బైక్ ఉండేలా చూసుకుంటున్నారు. అతి తక్కువ  ధరల్లో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే టూ విల్లర్స్ ని కొనడానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. దీనికి గల కారణం పెట్రోల్ ధరలకు ఆకాశాన్ని అంటడమే.

ఈ తరుణంలో కంపెనీలు కూడా తక్కువ ధరల్లో మంచి మోడల్స్ ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. అలాగే అధునాతన ఫీచర్లను జోడిస్తూ అధిక మైలేజ్‌ ఇచ్చే బైక్‌లను రూపొందిస్తున్నాయి.  ఇక అత్యధికంగా  10 రకాల బైక్  లు మార్కెట్ లో  అధికంగా అమ్ముడుపోతున్నాయి. ఇందులో హీరో నుండి టివిస్  వంటివి జాబితాలో ఉన్నాయ్.

తక్కువ ధరల్లో మైలేజ్‌ ఇచ్చే టాప్‌ -10 టూవీల్లర్స్ ఇవే..

1. Hero Splendor Plus ‌ (హోండా స్ప్లెండర్ ప్లస్) – Rs. 61,785. గా ఉంది.

2. Honda Activa 6G  (హోండా యాక్టివా 6జీ) – Rs. 67, 856 గా ఉంది.

3. Hero HF Deluxe ‌ (హీరో హెచ్‌ఎఫ్‌ డిలక్స్ ) – Rs. 52,480 గా ఉంది.

4. Honda CB Shine  ‌ ( హోండా సీబీ షైన్) – Rs. 71,278 గా ఉంది.

5. Bajaj Pulsar   (బజాజ్‌ పల్సర్‌ 125 సీసీ) – Rs. 72,818 గా ఉంది.

6. TVS Jupiter  ‌ (టీవీఎస్‌ జుపిటర్) – Rs. 65,599 గా ఉంది.

7.  TVS XL Super ‌ (టవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ సూపర్) – Rs. 43146 గా ఉంది.

8. Suzuki Access ‌ (సుజుకీ యాక్సెస్) – Rs. 73, 045 గా ఉంది.

9. Bajaj Platina  (బజాజ్‌ ప్లాటీన 100 సీసీ) – Rs. 52,828 గా ఉంది.

10. Royal Enfield Classic 350  ( రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 సీసీ )  –  Rs. 1,66,171. గా ఉంది. ఈ ధరలని బట్టి, అలాగే మైలేజ్ పరంగా చుస్తే…  హీరో స్ప్లెండర్ దేశంలో ఎక్కువగా అమ్ముడు పోయింది. దీని తరవాత  హోండా యాక్టివా రెండవ స్థానం సంపాదించుకుంది. అదేవిదంగా  హీరో యొక్క హెచ్ఎఫ్ డీలక్స్ టాప్ -3 లో స్థానం సంపాదించుకుంది. Best Selling Bikes in India ఇలా 2021 మర్చి వరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫై 10 బైక్స్ నిలిచాయి. అలాగే  రాయల్ ఎన్ఫీల్డ్ కూడా బాగానే అమ్ముడయ్యాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button