Tollywood news in telugu

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 3 నెలలలో హిట్ కొట్టిన 8 సినిమాలు ఇవే… !

telugu hit movies 2021 : ఈ సంవత్సరం టాలీవు ఇండస్ట్రీకి గడచినా 3 నెలలు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు.  ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో విడుదలైన కొన్ని సినిమాలు  ఊహించని విజయాలను సొంతం చేసుకున్నాయి.

telugu hit movies 2021

దీనికి గల కారణము లేకపోలేదు. అదేంటంటే… సినిమాల కథ పరంగా బాగుండటం, అదేవిదంగా చాల రోజుల తరవాత ప్రజలు బయటికి వచ్చి సినిమాపై ఉన్న ఆకలిని తీర్చుకోవడం, ప్రభుత్వం థియేటర్లకు ఫుల్ ఆక్యుపెన్సీ పర్మిషన్ ఇవ్వడం. ఇలా యావరేజ్ గా ఆడే సినిమాలు కూడా హిట్ కొట్టాయి .  ఈ హిట్ల ద్వారా ఇండస్ట్రీలో కొంత ఊపు వచ్చిందనే చెప్పాలి.

1. క్రాక్: సంక్రాంతి సందర్బంగా విడుదలైన మూవీ ‘క్రాక్’ , కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కాస్త కేసులు తగ్గాక సగం ఆక్యుపెన్సీ తో తెలంగాణ ప్రభుత్వం థియేటర్లకు పర్మిషన్ ఇచ్చింది. అసలు ప్రజలు థియేటర్లకు వస్తారా, రారా అనే అనుమానం ఉన్నపటికీ ‘క్రాక్’ సినిమాను నిర్మాతలు విడుదల చేయడంతో ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాతో ప్రజలకు సినిమాపై ఉన్న ఆకలిని  కొంత తీర్చుకున్నారు. అలాగే మిగితా నిర్మాతలు కూడా ‘క్రాక్’ సినిమాకు వచ్చిన 38 కోట్ల వసూళ్లను చూసి , ఇక వారు తీసే సినిమాలు కూడా ఆడతాయని దైర్యం  తెచ్చుకున్నారు. 

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

2. మాస్టర్: విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’ , ఈ సినిమ జనవరి 13 న విడుదలై , తెలుగు సినిమా కానప్పటికీ , ఘనవిజయం  సాధించి దాదాపు 12 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరో  విజయ్‌కు మార్కెట్ పెరిగిందనే చెప్పాలి.

3. రెడ్: ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ నటించిన సినిమా ‘రెడ్’, ఇదికూడా సంక్రాంతికే వచ్చి మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.

4. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా :  యాంకర్ ప్రదీప్ హీరో తొలిసారి నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కూడా  హిట్ కొట్టింది. ముందుగా యాంకర్ సినిమా ఏమి అడుతదిలే అనుకున్నవారు ముక్కున వేలు వేసుకొనే వసూళ్లను రాబట్టింది.

5. జాంబి రెడ్డి:  కరోనా వైరస్ కాన్సెప్టుతో , ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘జాంబి రెడ్డి’ , ఈ సినిమాకూడా కరోనా సమయంలో ఫిబ్రవరి 5న విడుదలై వసూళ్ల విషయంలో  సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. 

Read  అందాల అనసూయా....

6. ఉప్పెన:  వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన  సినిమా ‘ఉప్పెన’ , ఈ సినిమా  100 శాతం థియేటర్స్ ఓపెన్ అయ్యాక విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇంత బాగా ఒక కొత్త హీరో, హీరోయిన్ సినిమాను ఆదరిస్తారని ఎవరు కూడా ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులు  కొత్త హీరోనా , పాత హీరోనా, చిన్న సినిమానా, పెద్ద సినిమానా , అని చూడకుండా మంచి కథ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పటికి  ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ఈ సినిమా 51 కోట్ల షేర్స్ ని రాబట్టింది.

7. నాంది: అల్లరి నరేష్ గత కొన్ని సంవత్సరాలుగా హిట్స్ లేక సతమతమౌవుతున్న సమయంలో , హీరోగా  ‘నాంది’  సినిమాలో నటించి. ఈ సినిమా ద్వారా విజయాన్ని తన కాతాలో వేసుకున్నాడు. ఈ మూవీని విజయ్ కనకమేడల తెరకెక్కించిగా  6.5 కోట్ల షేర్ లను సొంతం చేసుకుంది.  8. జాతి రత్నాలు:  నవీన్ పొలిశెట్టి, ఫరియా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ‘జాతి రత్నాలు’  మార్చ్ 11న శివరాత్రి కానుకగా రిలీజ్ ఐ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే  ఈ చిత్రం 38 కోట్ల షేర్ రాబట్టింది.

Read  అందాల అనసూయా....

8. జాతి రత్నాలు: నవీన్ పొలిశెట్టి, ఫరియా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ‘జాతి రత్నాలు’ మార్చ్ 11న శివరాత్రి కానుకగా రిలీజ్ ఐ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ చిత్రం 38 కోట్ల షేర్ రాబట్టింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button