Today Telugu News Updates
హైదరాబాద్ లో మరో పరువు హత్య

Hemanth Murder మన హైదరాబాద్ లో మరో పరువు హత్య జరిగింది. హేమంత్ కు కేవలం డబ్బు లేదన్న కారణం మరియు వేరే కులానికి చెందినవాడు కావడంతో,తమ పరువు పోయిందన్న అవమానం తో ఈ హత్య చేయించారని తేలుస్తుంది.
హేమంత్ ని డబ్బుతో లొంగదీసుకుని తన కూతురిని దక్కిచుకోవాలని అవంతి తండ్రి ప్రయత్నించి నప్పటికీ, హేమంత్ ఒప్పుకోక పోవడంతో ఈ హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .
పోలీసుల దర్యాప్తులో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవంతి మేనమామ యుగేందర్ ఈ హత్యకి పది లక్షల డీల్ కూడా కుదుర్చుకున్నాడని, అడ్వాన్స్ గా ఆ కిల్లర్లకి లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చానని యుగేందర్ పోలీసుల దర్యాప్తులో తెలిపాడు.
అవంతి మాత్రం తన హేమంత్ ని చంపుతారని అనుకోలేదని,ఇపుడు కాకపోయినా కొన్ని రోజులు గడిచాక మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని దీవిస్తారని అనుకున్నానని మీడియాకు తెలిపింది.