Tollywood news in telugu

ఈ టీజర్ “చాలా హాట్ గురూ”

టాలీవుడ్ లో దేవదాన్ సినిమాతో హీరోగా తెరోగేట్రo చేసిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ తరువాత నటిస్తున్న చిత్రం hello guru prema kosame . ఎన్నో హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఇది ఒక రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్. రామ్ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు, ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

hello guru prema kosame సినిమా టైటిల్ ని చూస్తేనే ఇది యూత్ కి కనెక్ట్ అయ్యే ఒక మంచి లవ్ ట్రాక్ ఉoటుందని తెలుస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కాలేజీ చుట్టూ తిరిగే కుర్రాడిగా రామ్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఇంజనీరింగ్ విద్యార్థినిగా నటిస్తోంది. రామ్ కూడా ఈ మూవీలో ఒక స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక రామ్, అనుపమ ఇందులో బావ, మరదలుగా, హీరోకి మామయ్య పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోయే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ‌కి మంచి రెస్పాన్స్ రావడంతో.. నిన్న సాయంత్రం 5 గంటలకు ‘hello guru prema kosame’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌లో అనుపమ పరమేశ్వరన్ ఇంతకు ముందు మనం చూడని ఒక సరికొత్త గ్లామర్ రోల్ లో కనిపిస్తుంది. సాంబ్రానితో తలను ఆరబెట్టుకుంటూ అటుగా వచ్చిన రామ్ తదేకంగా చూస్తుంటే చూశావా? అని అడిగితే నీ కోసమే అక్కడ కాఫీ పెట్టాను చూడలేదా అంటూ చీరను సర్దుకుంటూ ఎలా ఉంది? అని అడగగా రామ్ హాట్‌గా ఉంది అంటే అనుపమ ఆ అంటే అదే కాఫీ అని రామ్ చెప్పడం ఫుల్ రొమాంటిక్ టీజర్ అనే చెప్పాలి.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button