జ్ఞాపకశక్తి తక్కువగా ఉందా.. మరేం పర్లేదు ఇలా ట్రై చేయండి
మంచి రుచితో పాటు సువాసనను కూడా కలిగి ఉండే మొక్క పుదీనా. దీనిని తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6తో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్‌ను, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్, ప్రొటీన్స్ లాంటి పోషక పదార్థాలను కలిగి ఉంది. ఇప్పుడు పుదీనా ప్రయోజనాలను పరిశీలిస్తే..

పుదీనా రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఇది జీర్ణశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచే ఔషదంగా పనిచేస్తుంది.
విటమిన్-ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
తరచూ పుదీనా ఆకులను తీసుకుంటూ ఉండటం వల్ల నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చు.
తరచూ ఎక్కిళ్లు మనల్ని బాధిస్తుంటే పుదీనాకు చక్కెర కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు క్రమేణా తగ్గిపోతాయి.
చలికాలంలో ఎక్కువగా వచ్చే ట్రాన్సిల్స్ వాపు కూడా పుదీనా తరచూ తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది.
పుదీనా ఆకుల పేస్టును ఫేషియల్‌గా కూడా వాడతారు. దీంతో చర్మం కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా, జిడ్డు కూడా పోతుంది.