Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 సూత్రాలు
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి స్వచ్చమైన గాలిని పీల్చడంతో పాటు అలవాట్లు, జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ వాతావరణంలో ఊపిరితిత్తులకు హానిచేసే తవిటి పురుగులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తవిటి పురుగులు పెరగకుండా ఉండాలంటే ఇంట్లోనూ, మనం పనిచేసే చోట తేమ ఉండకుండా చూసుకోవాలి.
వంటగదిలో పొగు బయటకు పంపే ఫ్యాన్లు, చిమ్నీలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎయిర్ కండీషనర్ల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. సిగరెట్ చుట్ట, బీడీ కాల్చే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. ఇంట్లో ఎవరైనా పొగ తాగే అలవాటు ఉంటే మాన్పించండి.

క్యాబేజీ, గోబీ పువ్వు, బ్రకోలి వంటి వాటిలో ఉండే ఐసోథయనైట్ పోషకాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు కాలుష్యం అధికంగా ఉండే పగటి వేళల్లో కంటే ఉదయం, సాయంత్రం పనులు చక్కబెట్టుకోవడం మేలు.
వ్యాయామానికి ఊపిరితిత్తులు బాగా స్పందిస్తాయి. దీర్ఘంగా శ్వాస తీసుకునే ప్రాణాయామాల్ని నిత్యం పావుగంట సేపు సాధన చేయడం మంచిది.
అధిక బరువు ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఎత్తకు తగ్గ బరువు ఉండేలా ఆహార వ్యాయామాలను, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.