మహిళల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవే ద బెస్ట్ ఫుడ్స్.. అవేంటో మీరు చూసేయండి.
కుటుంబంలో అందరికీ కావాల్సిన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండేలా అనుక్షణం తపించే మహిళలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళల ఆరోగ్యం, వారు తీసుకునే పౌష్టికాహారంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకూ మహిళలు ఎటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది మహిళలు పనిలోపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎంత పనిలో ఉన్నా వేళకు సరైన ఆహారం తీసుకోవడం అవసరమని గుర్తించాలి. రోజూవారి ఆహారంలో ప్రోటీన్లు, పిండిపదార్థాలు, విటమిన్లు, మినరల్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

మహిళలు కెరోటీనాయిడ్స్ ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
చేపలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండె జబ్బులదాకా అన్నిటిని నివారిస్తాయి.
బీపీ నుంచి మధుమేహం వరకు ఓట్స్ మంచి ఔషదంలా పనిచేస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో మరింత మేలు చేస్తాయి.
నారింజ, ద్రాక్ష పండ్లను తినడం వల్ల మనశరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.