అధిక బరువును తగ్గించే హెల్తీ ఫుడ్స్
ఆరోగ్యకర మరియు ఫిట్‘గా ఉండే శరీరం కోసం వ్యాయామo తప్పనిసరి. ప్రతి రోజు ఎక్సర్సైజ్ తో పాటు బరువు తగ్గుటానికి సరైన ఆహార ప్రణాళిక అవసరం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అధిక బరువును సులువుగా తగ్గించే ఏడు రకాలైన హెల్తీ ఫుడ్స్ మీ కోసమే. వీటిని మన రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు .
- ఆపిల్ :
రోజు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండవచ్చు అని మీకు తెలుసు. ఆపిల్ పెక్టిన్ ను కలిగి ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను స్పష్టంగా మరియు పనితీరును సరిగ్గా ఉంచడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన ఫైబర్. మరియు మీ అధిక బరువును తగ్గిస్తుంది.
- బాదం:
బాదంపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాదంలో ఇ విటమిన్, ఫైబర్ , ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ తో పాటు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. రోజు నానబెట్టిన బాదం పప్పును గుప్పెడు పై పొట్టును తీసేవేసి తీసుకుంటే అధిక బరువును తగ్గించడంతో పాటు గుండెను పదిలo చేసుకోవచ్చు.
- గ్రీన్ టీ:
గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్‘గా ఉంచుతుంది. దీనిలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలోరిలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి మీరు తీసుకునే చక్కర ద్రావకానికి బదులుగా గ్రీన్ టీ తీసుకోండి.
- గ్రీక్ యోగర్ట్ :
ఇది రుచికరమైన అధిక ప్రోటీన్ ఆహారం. సాధారణ పెరుగుతో పోల్చితే గ్రీక్ యోగర్ట్ ప్రోటీన్ మరియు సగం పిండి పదార్థాలు రెండింతలు కలిగి ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- లెమన్ జ్యూస్ :
నిమ్మకాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. యాంటీ- ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తీసుకునే లెమన్ జ్యూస్ జీవక్రియను పెంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. గోరువెచ్చని నీటిలో తేనే, నిమ్మరసం కలిపి తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.
- ఎగ్ వైట్ :
ఎగ్ వైట్ (గుడ్డు తెల్ల సొన)లో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలియని వారు ఎగ్ వైట్ ను అంతగా తినరు. అయితే ఎగ్ వైట్ కూడా ఎక్కువ శాతం న్యూట్రీషియన్లను అందిస్తుంది. దీనిలో కోలెస్టరాల్ తక్కువగా ఉంటుంది, బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది.
- బీన్స్ :
ఆరోగ్యంగా, ఫిట్’గా ఉండటనికి బీన్స్ ఒక సంపూర్ణమైన ఆహరం. ఇవి తక్కువ కొవ్వుని కలిగి ఉంటాయి. ఎక్కువగా బీన్స్ 2-3 శాతం మాత్రమే కొవ్వుని కలిగి ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మరి ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోండి అధిక బరువును తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్తీ అండ్ ఫిట్.