మీ రోజూ వారి ఆహారంలో వీటిని తప్పక ఉండేలా చూస్కోండి
నిమ్మజాతి పండ్లు: ముఖ్యంగా నిమ్మ పెద్ద ప్రేగును శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మలినాలు చాలా వరకు తొలగిపోతాయి.
ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్, ఆకుకూలు మనల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. డైజెస్టివ్ ట్రాక్‌ను చక్కగా ఉంచుకోవడానికి రోజువారి ఆహారంలో వీటిని తప్పనిసరిగా ఒక భాగం చేసుకోవాలి.
పళ్లరసాలు: తరచుగా పళ్ల రసాలను తాగాలి. పళ్ల రసాల్లో తగినంత పీచుతో పాటు, ఎంజైములు పెద్ద పేగును శుభ్రం చేసే ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

వెల్లుల్లి: వెల్లుల్లి వాసన అంటే పడని వారు చాలా మందే ఉండొచ్చు. అయితే ఇది గుండెని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
చేపలు: తరచూ చేపలు తీసుకోవడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, డైజెస్టివ్ ట్రాక్‌ను శుభ్రం చేసే ఆయిల్స్ పెద్ద ప్రేగును శుభ్రం చేయడానికి సహాయపడతాయి.
చిక్కుళ్లు, తృణధాన్యాలు: వీటిలో తక్కువ క్యాలరీస్, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి సులభంగా జీర్ణమవడానికి సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
గ్రీన్‌టీ: లివర్‌ను డిటాక్స్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి. బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.