పాలు అనేవి కేవలం పిల్లలకి మాత్రమే మంచిదా??
జీవితంలో పాలు తాగని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే పుట్టినవెంటనే శిశువు మొదట తీసుకునే ఆహారం తల్లి పాలు కాబట్టి. మనం తీసుకునే ఆహారంలో పాలకు ప్రత్యేకమైన స్థానo ఉంది. పాలు అనేవి ప్రత్యేకంగా శాకాహారo తీసుకునే వారికి ఒక సంపూర్ణమైన ఆహారంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ముఖ్యంగా పాలు దాని పోషక మరియు జీర్ణ లక్షణాల వలన ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ప్రోటీన్, విటమిన్ A, B1, B2, B12, మరియు D, అలాగే పొటాషియం మరియు మెగ్నీషియంతో సమృద్ధిగా లోడ్ చేయబడిన, ఒక అత్యంత ఆరోగ్యకరమైన ఆరోగ్య పానీయాలలో పాలు ఒకటి. అయితే, పెద్దవారిలో చాలా కొద్దిమంది మాత్రమే సంతోషంగా ఒక గ్లాసు పాలను తాగుతారు.
పెద్దవారు పాలను ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకోవడం చాలా మంచిది. ఇది ఒక అద్భుతమైన నైట్ డ్రింక్ గా పనిచేస్తుంది కాబట్టి పెద్దవారు పాలు తీసుకోకుండా ఉండకూడదు.
milk లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది వ్యక్తిలో నిద్రను ప్రేరేపిస్తుంది మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బాడీ యొక్క స్లీపింగ్ సైకిల్ ని కంట్రోల్ చేసే రెండు న్యూరోట్రాన్స్మిటర్లు అయిన సెరోటోనిన్ మరియు మెలటోనిన్లను ఎక్కువగా సృష్టించేందుకు ట్రిప్టోఫాన్ శరీరానికి సహాయపడుతుంది కాబట్టి పాలను రాత్రి వేళలో తీసుకుంటే సులువుగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా, నిద్రలేమితో బాధపడుతున్న వారు అంటే దీనినే ఇన్సోమ్నియా అని కూడా అంటారు, రాత్రి పూట పాలు తాగడం వలన వాటిలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం, నిద్రలేమి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
పిల్లలకు పాలు ఉదయం పూట, బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక గ్లాస్ మొత్తం పాలను ఇవ్వడం చాలా మంచిది. కానీ పెద్దవారు ఉదయం పూట కేవలం milk మాత్రమే తీసుకోవడం అంత మంచిది కాదు. కారణం వారి జీర్ణ వ్యవస్థ పాలను డైజెస్ట్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతుంది. మరియు దీర్ఘకాలంలో తరచుగా గుండెల్లో లేదా జీర్ణశయాంతర సమస్యల రూపంలో కనిపిస్తాయి. కాబట్టి పాలను సెరల్స్ తోగాని లేదా పోరిడ్జ్ తో గాని కలిపి తీసుకోవడం మంచిది.
అంతేకాక, milk పిల్లలకి తాగించే విషయానికి వస్తే, తల్లిదండ్రులు ఎక్కువ పాలు తాగితే వార్కి చాలా మంచిది అనుకుంటూ ఉంటారు. కాని అది సరైనది కాదు అని వైద్యులు చెపుతున్నారు. “పిల్లలు ప్రతి రోజు, రెండు కప్పుల పాలు ఉదయం మరియు రాత్రి నిద్రపోవడానికి ముందు ఇస్తే చాలు. అంత కంటే తక్కువ, ఎక్కువ కాకుండా చూసుకుంటే చాలు. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు milk ఎక్కువగా తాగితే వారి బోన్స్ బాగా డెవలప్ అవుతాయనే ఒక అపోహలో ఉంటారు. కానీ అతిగా పాలు తాగడం వల్ల పిల్లలో తీవ్రమైన ఐరన్ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు క్రమం తప్పకుండా పాలు తాగాలి, అలాగే మహిళలు కూడా తమ ఆహారంలో, ప్రత్యేకంగా మెనోపాజ్ తర్వాత పాలను తప్పక తీసుకోవాలి. “మోనోపాజ్ తరువాత మిల్క్ తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, ఆస్టియోపొరోసిస్ అనేది ప్రధానంగా 50 ఏళ్ల వయస్సు పైబడిన మహిళల్లో సంభవించే ఒక ప్రాణాంతకమైన ఎముకల వ్యాధి. పాలు తీసుకోవడం వల్ల ఇది ఎముక సాంద్రతను మెరుగుపర్చడానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం మరియు విటమిన్ D ను అందిస్తుంది.
సో పాలు కేవలo పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.