health tips in telugu

విటమిన్‌ ఎ సమృద్ధిగా లభించే పదార్ధాలు ఏంటో తెలుసా​..?

విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురవుతాయి. విటమిన్‌ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి?. విటమిన్‌ ఎ లోపం నివారించడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?. విటమిన్‌ ఎ సమృద్ధిగా లభించే పదార్ధాలు ఏంటో పరిశీలిస్తే..

విటమిన్‌ ఎ:
బీటాకెరోటిన్‌ అనే పదార్థం ద్వారా విటమిన్‌ ఎ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం, ప్రేగులో విటమిన్‌ ఏగా మారుతుంది. విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రులక ఎదుగుదలను పెంచి, చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలో ఎముకలు, దంతాలు బలపరిచేలా చేస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్‌ ఏ పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది.

విటమిన్‌ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు:
ఏ విటమిన్‌ లోపం వల్ల కంటిచూపు, రేచీకటి వచ్చే అవకాశం ఉంది. చర్మం పెలుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంది.

విటమిన్‌ ఏ లభించే పదార్థాలు:
కేరట్‌, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్‌, చేపలు, చిలకడదుంప, గుమ్మడికాయ, మాంసము, గుడ్లలో విటమిన్‌ ఏ సమృద్ధిగా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button