Tulsi Leaves: తేనెలో స్పూన్ తులసి రసం కలుపుకుని తాగితే..
మన హైందవ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారని మన వేదాలు చెబుతున్నాయి. అనారోగ్యాన్ని ఆమడ దూరంలో పెడుతుందని తులసి ఆకుకు పేరు. ఇదిలా ఉంటే.. తులసి చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు, తరచూ తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తీసుకుందాం..

శ్వాసకి సంబంధించిన ఇబ్బందులకు తులసి ఒక మంచి ఔషదం
జలుబు చేసినపుడు తేనెలో స్పూన్ తులసి రసం కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
ఆస్తమా నివారణకు తులసి మంచి నివారణగా చెప్పవచ్చు.
అల్లం రసంతో తులసి రసాన్నికలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. కడుపులో ఏర్పడ్డ గ్యాస్ట్రిక్ సమస్యలకు తులసి ఒక మంచి పరిష్కారం
నోటి దుర్వాసతో బాధపడేవారు తులసి ఆకులను నమలడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తులసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.