health tips in telugu
Molakalu: రోజూ మొలకలు తింటున్నారా..? ఈ ప్రయోజనాలు మీ సొంతం
గజిబిజి పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అనేక ఇతర కారణాల వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందకుండా పోతున్నాయి. దీంతో శరీరం వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి అనేక రుగ్మతల బారిన పడుతోంది. ఇటువంటి సమయంలో పోషకాలను భర్తీ చేయడానికి మొలకలు చాలా అవసరం. ఈ మొలకలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే..
మొలకలలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. శరీరం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

మొలకలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఇందులో ఉండే విటమిన్ సీ వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. మధుమేహంతో పోరాడుతుంది.
మొలకలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.
శరీరాన్ని బలోపేతం చేస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది.