ఈ చిట్కా పాటిస్తే ఆరోగ్యవంతమైన ముఖ వర్చస్సు మీ సొంతం
నువ్వులతో చేసిన తీపి పదార్థాలు, నువ్వులతో చేసే వంటలు, నువ్వుల నుంచి తీసిన నూనె ఇలా ప్రతి ఇంట్లో నువ్వుల వాడకం ఎప్పటి నుంచో ఉంది. నువ్వులు తెలుపు, నలుపు రంగులలో దొరుకుతుంది. నువ్వులను ఆహారంలో వాడటం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది.
నువ్వుల్లో విటమిన్స్, ప్రొటీన్స్, కాపర్, క్యాల్షియం, జింక్, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

నువ్వుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన రక్తనాళాలు, ఎముకలు, కీళ్లూ ఆరోగ్యంతో ఉంటాయి.
నువ్వుల నూనెతో అధిక రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేగాక నువ్వులు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా మారస్తుంది. ప్రతిరోజు నువ్వుల నూనెతో ముఖానికి మర్దన చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన ముఖ వర్చస్సును సొంతం చేసుకోవచ్చు.