Sapota: సపోటా తినడం వల్ల ఇన్ని లాభాలా..?
సపోటా తియ్యని రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే గుజ్జు తేలికగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలతో పాటు పొటాషియం, కాపర్, ఐరన్, విటమిన్స్‌తో పాటు జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్‌లను కలిగి ఉంది.
సపోటా విటమిన్ ఇను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.
సపోటా నుంచి వచ్చే పాలకు శరీరంపై ఏర్పడే పులిపిర్లను తగ్గించగలిగే శక్తి ఉంది.

సపోటా జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడుతుంది. సపోటా గింజల నుంచి తీసిన ఆయిల్ జట్టుకు ఒక కండీషనర్‌లా పనిచేస్తుంది.
ఇందులో ఉండే పీచుపదార్థం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్దకాన్ని దూరం చేస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది.
ఎముకల గట్టితనానికి సపోటా ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్ శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.