బియ్యం నీళ్లతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Rice Water for Skin and Hair: మీకు తెలుసా నానబెట్టిన బియ్యం నీరు మీ చర్మం, జట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తుందని. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. చైనా, జపాన్, ఆసియాదేశాల మహిళలు బియ్యపు నీరుని వాడి చర్మ సౌందర్యంతో పాటు, కేశ సౌందర్యాన్ని కూడా పెంచుకుంటున్నారట. అయితే బియ్యపు నీళ్ల ప్రయోజనాలను పరిశీలిస్తే..
నానబెట్టిన బియ్యపు నీటిలో చర్మ, కేశ సౌందర్యానికి ఉపయోగపడే విటమిన్ బి, సి, ఈతో పాటు మినరల్స్, అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.

బియ్యపు నీటిలో దూదిని ముంచి చర్మానికి దిద్దుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
రైస్ వాటర్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై ఏర్పడే మొటిమలు, పొక్కులు, నల్లటి మచ్చలను నివారిస్తాయి.
బియ్యపు నీటిని జుట్టకు రాయడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు. మెరిసే కాంతివంతమైన కేశాల్ని పొందవచ్చు.
బియ్యపు నీటిలోని పోషకాలు వెంట్రుకలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేందుకు సాయపడతాయి. ఇది జుట్టుకు కండిషనర్‌లా పనిచేస్తుంది.