health tips in telugu
Orange: ఆరెంజ్ జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్యం..
Health Benefits: ఆరెంజ్ ఇదో పోషకాల గని. దీనిని మనం ఏ రకంగా తీసుకున్నా విటమిన్-సీ నిండుగా ఉంటుంది. అందుకే సిట్రస్ జాతిలో ఆరెంజ్ పండుని మించింది లేదని అంటుంటారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే..
నారింజలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం వివిధ రకాలైన తేమ పదార్థాలను వాడతారు. వీటితోపాటు ఈ కాలంలో లభించే నారింజ, సీతాపల పండ్లను తీసుకోవాలి.

నారింజ ముందస్తు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ముఖంపై మడతలను తగ్గించి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నారింజలో ఉండే యాంటిఆక్సిడెంట్స్‌తోపాటు ఉండే ఫ్లేవనాయిడ్స్ మంచి నిద్రని కలిగిస్తాయి. జ్ఞాపకశక్తితో పాటు నేర్చుకొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
నారింజ తొక్కని ఎండలో ఆరబెట్టి పొడి చేసుకుని చర్మ సౌందర్యానికి ఉపయోగించవచ్చు.