health tips in telugu

Health benefits of onion : పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి !

Health benefits of onion : ఉల్లిని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి వాడుతున్నట్టు చరిత్ర చెబుతుంది. ఉల్లి పాయలు తరుగుతున్నపుడు  కన్నీళ్లు పెట్టించినా….మన శరీరం ఎలాంటి సమస్యలువున్న వాటిని పారదోలి శాంతోషాన్ని అందజేస్తుంది. ఉల్లిని తరిగేటపుడు ఎంజైమ్స్, ఘాటైన సల్ఫేర్ గ్యాస్ విడుదల కావడంతో అది మన కంట్లోకి వెళ్లి నీరు  వచ్చేలా చేస్తుంది.

మన దేశంలో ఎక్కువగా గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్‌,మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లలో ఉల్లి పాయలు సాగుచేస్తారు.

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం…

మనం వంటచేసేటపుడు ఉల్లిపాయను జోడించి వండడం వల్ల ఎంతో రుచి వస్తుంది. అలాగే  పచ్చివి తిన్నా ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే అది  జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు అధిక కొవ్వును నివారిస్తుంది. అదేవిదంగా  ఉల్లిలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, పీచు, సల్ఫర్, పొటాషియం పదార్థాలు ఆరోగ్యానికి మేలు కలుగజేస్తాయి . పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమిని తరిమికొడుతుంది.

ఇన్ఫెక్షన్ అలాగే  జుట్టుకు కలిగే సమస్యల నివారణ :

మనకు బ్యాక్టీరియాల నుండి వచ్చే ఇన్ఫెక్షన్లు అలాగే  డయేరియాల బారిన పడకుండా  కాపాడతాయి.  శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో అధికంగా ఉంటాయి.  ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం లో కలిగే అనేక సమస్యలనుండి  కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎముకల పటిష్టత పెరుగుతుంది. ఉల్లిలో ఉండే  యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా ఉల్లి ని రసంగా మర్చి తలకు పట్టించడం వల్ల  జుట్టు రాలడాన్ని , చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. పట్టులాంటి నల్లని జుట్టు వచ్చేలా చేస్తుంది.

మూత్ర సమస్యల నివారణ చర్య :

మూత్రాశయంలో ఏర్పడే రాళ్ల వల్ల కలిగే బాధ అదుపుచేయడానికి ఉల్లి ఒక మంచి ఔషదం. ఉల్లి గడ్డను చిన్న చిన్న ముక్కలుగా కోసి వీటిని పెరుగులో కలిపి తినడం వల్ల  కిడ్నీలోని రాళ్లు కరిగేలా ఉపయోగపడుతుంది.  ఉల్లిపాయలు వేసి తయారు చేసే కర్డ్‌బాత్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్ర  విసర్జన సమయంలో  మంట, నొప్పి రాకుండా ఉల్లి నివారిస్తుంది. దీనికోసం కొన్ని ఉల్లి పాయను  నీటిలో వేసి బాగా మరిగిన తరువాత చల్లార్చి తాగండి.

చర్మ సమస్యల నివారణ చర్య :

ఆలివ్ ఆయిల్, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి పట్టిస్తే.. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. తేలు లేదా  తేనెటీగలు  కుట్టినప్పుడు వచ్చే నొప్పిని అదుపుచేయడానికి , అదేవిదంగా   కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుంది.  కాలిన చోటు బొబ్బలు రాకుండా చేయడంతో పాటుగా , బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.

మధుమేహం, గుండె సమస్యల నివారణ చర్య :

మధుమేహ సమస్య తో బాధపడేవారికి పచ్చి ఉల్లిపాయలను తినడంవల్ల  ఇన్సూలిన్ ఉత్పత్తి జరిగి సమస్య దూరం అవుతుంది. దీనిలో  ఉండే క్రోమియం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. పిల్లలలోను, పెద్దలలోను  జ్ఞాపకశక్తిని పెంచడానికి తోడ్పడుతుది. అదేవిదంగా  నాళాల్లో రక్తం గడ్డకడితే గుండె పోటు  సమస్యలు వస్తుంది కాబట్టి ఉల్లి తినడం వల్ల  శరీరంలోని రక్తం ను పల్చగా ఉంచి కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేసి గుండె జబ్బులను  దరిచేరనీయదు. 

సంతాన సమస్యల సమస్యల నివారణ చర్య :

 తేనెలో కాస్త ఉల్లి రసాన్ని కలిపి తీసుకుంటే వీర్య వృద్ధి చెందుతాయి. ముక్యంగా  ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంపొందిస్తుంది.  ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి ప్రతి రోజు మూడుసార్లు తీసుకున్నా లైంగిక శక్తి పెరుగుతుంది.  ఉల్లి సెక్స్ కోరికలను పెంచడమే కాకుండా  జననేంద్రియాలు సక్రమంగా పనిచేసేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది.

ఆస్త్మా, జాండీస్‌ సమస్యల నివారణ చర్య :

ఉల్లి గడ్డల్లోని సల్ఫర్ సమ్మేళనాలు ఆస్త్మాకు కారణమయ్యే బయో కెమికల్ చెయిన్ ఫార్మేషన్‌ను ఆపేస్తుందని పరిశోధనల్లో తెలిసింది.  దగ్గుతో అతిగా బాధపడేవారు కొంత మోతాదులో ఉల్లి రసాన్ని తీసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు  ఉదయం చిటికెడు ఉప్పు వేసుకుని తాగినట్లయితే జాండీస్, కామెర్ల  సమస్య నుండి బయటపడొచ్చు.

చెవి, దంతాల సమస్యల నివారణ చర్య :

పచ్చి ఉల్లిపాయ ముక్కలను కనీసం 2-3 నిమిషాలు నమలడం వాళ్ళ  దంతక్షయ సమస్య నుండి దంతాల్లో ఉన్న క్రిముల బారి నుండి తప్పించుకోవచ్చు. అలాగే చిగుళ్ల సమస్యను కూడా నివారిస్తుంది.  అదేవిదంగా రెండు ఉల్లి రసం చుక్కలు వేయడం ద్వారా చెవి నొప్పి సమస్య రాకుండా చేస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button