నేరేడు పండు వల్ల అద్భుత ప్రయోజనాలు..
నేరేడు పండు వేసవికాలపు పండుగా చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది. నేరేడు పండు, ఆకులు, చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
నేరేడు పండు సోడియం, పొటాషియం, క్యాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ,సితో పాటు రైబోప్లెవిన్, ఫోలిక్ యాసిడ్‌లను సమృద్ధిగా కలిగి ఉంది.

ఇది అధికరక్తపోటు సమస్యలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్తంలో కేన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.
నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను, చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. మౌత్ అల్సర్లను తగ్గిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది.