health tips in telugu
Neem: రుచిలోనే చేదు.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
వేప అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కానీ.. వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా వేప నూనె చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. జుట్టు సంరక్షణకు, చర్మ సంరక్షణకు వేపనూనె ఎంతో సహాయపడుతుంది.
వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

వేప నూనెను తరచుగా ముఖానికి అప్లై చేయడం వల్ల మొహంపై ముడతలు తగ్గుతాయి.
జుట్టు పెరుగుదలకు వేపనూనె ఎంతో దోహదపడుతుంది. ఇందులో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
వేపనూనె చుండ్రు నివారణకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తలకు మసాజ్ చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గి చుండ్రు తగ్గుతుంది.