Honey Benefits: రోజూ ఒక స్పూన్ తేనెతో ఇన్ని ప్రయోజనాలా..
ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. కొబ్బరి నీళ్లు మాదిరిగా ఎటువంటి కల్తీ లేకుండా ఉండే స్వచ్చమైనది తేనె. తేనెటీగలు రకరకాల పూల మకరందాలను సేకరించి తేనె రూపంలో మనకు అందిస్తాయి. తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుంది నానుడి. ఒకసారి తేనె ప్రయోజనాలను పరిశీలిస్తే..

తేనె శరీరంలోని సూక్ష్మజీవులను సంహరిస్తుంది.
తేనెలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
తేనెలో దాల్చిన చెక్కపొడి కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ బాధ తగ్గుతాయి.
గోరు వెచ్చని నీళ్లలో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలిపి త్రాగితే బరువు తగ్గుతారు.
రెండు చెంచాల తేనెతో కోడిగుడ్డలోని తెల్లసొన, శెనగపిండి కలుపుకొని ముఖానికి మర్ధన చేసుకుంటే చర్మం కాంతిగా కనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో తేనె కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది.