Green Chillies: పచ్చిమిర్చి లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మనలో చాలా మందికి భోజనంలో పచ్చి మిరపకాయను నంజుకు తినడం అలవాటు. ఇది కొంత వింతగా ఉన్నా.. ఇలా మిర్చిని భోజనంతో పాటు తీసుకోవడం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మిర్చిలో విటమిన్ ఎ, సి, కెలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి.
మిరపకాయ శరీరానికి హానిచేసే టాక్సిన్‌లను శరీరం బయటకు విసర్జించడంలో సహాయపడుతుంది. శరీరంలో మెటాబాలిజం రేటును పెంచుతుంది.

మిర్చి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిర్చిలో ఉండే విటమిన్ సి శరీరాన్ని అనేక ఇన్‌ఫెక్షన్‌ల బారి నుంచి కాపాడుతుంది. సిట్రస్ పళ్లలో ఉండే విటమిన్ సీ మిర్చిలో కూడా ఉండటం మరో విశేషం.
బరువు తగ్గాలి అనుకునేవారు తమ ఆహారంలో మిర్చిని తప్పకుండా చేర్చుకోవాలి. శరీరంలో ఏర్పడే కొలెస్ట్రాల్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.
మిర్చిలో కాప్సయిసిన్ అనే ఎంజైమ్ మన మూడ్‌ని మార్చి మనల్ని ఆహ్లాదంగా ఉంచేలా సహాయపడుతుంది. అయితే మిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్లు, కడుపులో పుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల మితంగా తీసుకోవడం ఉత్తమం.