Gongura Leafs: మధుమేహానికి చెక్ పెట్టండిలా..!
గోంగూర అంటే తెలియని తెలుగువారుండరేమో. గోంగూర ఆహారంగానే కాకుండా ఔషదంలా కూడా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి2, బి9, విటమిన్ సితోపాటు పొటాషియం, క్యాల్షియం, పాస్ఫరస్, సోడియం, ఐరన్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. గోంగూర వలన కలిగే ప్రయోజనాలు..
గోంగూరలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. దీనిని తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.

గోంగూరలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తసరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.
గోంగూర మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట సంజీవని అని చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ఇన్సులెన్ స్థాయిలను పెంచుతుంది.
గోంగూర శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువు సమస్యను నివారిస్తుంది.
గోంగూర ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేసి తలకు పట్టించడం ద్వారా జుట్టురాలే సమస్యలను తగ్గించవచ్చు. ఇది బట్టతల సమస్యను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.