health tips in telugu
Menthulu: మెంతులతో ఇన్ని లాభాలున్నాయా..?
నిత్యం మనం వంటల్లో ఎన్నో రకాల దినుసులను వాడుతుంటాం. రోజులు మనం కూరల్లో వాడుకునే మెంతులు షుగర్‌ను అదుపులో ఉంచుతాయంటే ఔరా అనకుండా ఉంటామా..?. ఒక్క మధుమేహమే కాదు కొలెస్ట్రాల్, అధిక బరువు వంటి సమస్యలకు మెంతులు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మెంతులు మన ఆరోగ్యానికి చేసే మేలును చూస్తే..
మెంతులు మన శరీరంలో తగినంత వేడని ఉత్పన్నం చేస్తాయి. వాత, కఫాల్ని తగ్గిస్తాయి.

మెంతులు మన జీర్ణవ్యవస్థను శక్తివంతం చేస్తాయి. మలబద్దకం, షుగర్ వ్యాధి, అధిక కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తాయి.
మెంతులో మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
మెంతులు నీళ్ల విరేచనాలను తగ్గిస్తాయి. పేగుల లోపలి వాపును కూడా తగ్గిస్తాయి.