health tips in telugu
Curry Leaves: ఆహా కరివేపాకుతో ఇంత ఉపయోగమా…?
కరివేపాకును కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాం అనుకుంటే చాలా పొరపాటే. చాలామంది కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. కానీ కరివేపాకులో అనేక ఔషద గుణాలున్నాయి. అవేంటో మనకు ఎలా మేలు చేస్తాయో ఒకసారి పరిశీలిస్తే..
కరివేపాకులో కొవ్వు తగ్గించే గుణం ఎక్కువగా ఉంది. దీనిని పొడి చేసుకుని ప్రతిరోజూ ఒక టీ స్ఫూన్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ప్రతిరోజూ 10 కరివేపాకులను నమిలి మింగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు కలిపి తాగితే శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.
కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జును రాయడం వల్ల నొప్పి, గాయం త్వరగా నయమవుతాయి.