health tips in telugu
Senagalu: రోజు కప్పు శనగలు తింటే ఇన్ని ప్రయోజనాలా..!
శనగలను మనలో ఎంతో మంది చాలా ఇష్టంగా తింటారు. కొందరు వీటిని గుగ్గిళ్ల రూపంలోనూ, మరికొందరు నానబెట్టిన వాటిని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తీసుకుంటారు. ఎలా తీసుకున్నప్పటికీ శనగల వలన మనకు అనేక ఉపయోగాలున్నాయి. రోజూ కప్పు శనగలను తీసుకోవడం వలన కలిగే లాభాలను చూస్తే..
మాంసం తినని వారికి శనగలు మంచి ఆహారం. వీటిలో ప్రొటీన్లు మెండుగా ఉంటాయి.

శనగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ డీ,ఈ,ఏలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటాయి.
నానబెట్టిన శనగలు ఉదయాన్నే తినడం వల్ల లివర్ సంబంధ వ్యాధులు, రక్త ప్రసరణ ఇబ్బందులు దరిచేరవు.
ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.