Chapati: చపాతీలు తినేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
అధిక బరువుతో బాధపడుతున్న వారు బరువును తగ్గించుకోవడానికి ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఇందులో భాగంగా చాలా మంది రాత్రి సమయంలో రైస్ తినకుండా చపాతి తింటుంటారు. చపాతి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
చపాతీకి ఉపయోగించే గోధుమల్లో విటమిన్ బి, ఇలతో పాటు కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలతో పాటు అనేక పోషకాలు ఉంటాయి.

ఊబకాయం, అధికబరువు, అజీర్తి మలబద్దక సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట చపాతిని తీసుకోవడం చాలా మంచిది.
రాత్రిపూట మనం నిద్రపోవడం తప్ప ఏ పని చెయ్యం. అందువల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చు అవ్వకుండా, కొవ్వుగా మారి అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే చపాతీలు అధిక క్యాలరీలు కలిగి ఉన్నప్పటికీ ఇవి కొవ్వుగా మాత్రం మారవు.
చపాతీకి ఉపయోగించే గోధుమల్లో ఎలాంటి కొవ్వు ఉండదు. అంతేకాకుండా చపాతి ఇతర ఆహారపదార్థాలతో పోలిస్తే చాలా త్వరగా జీర్ణం అవుతుంది. అన్నంతో పోలిస్తే చపాతీలు శరీరానికి అధిక శక్తిని అందిస్తాయి.
గోధుమలు అధిక శాతం ఐరన్‌ను కలిగి ఉంటాయి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్నిపెంచుతుంది.